భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలి

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్2026 తెలంగాణవార్త ప్రతినిధి. పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంతో పాటు మరో విద్యార్థి హెచ్‌సీఎల్ టెక్‌బీకి ఎంపికైన సందర్భంగా మాజీ సైనికుడు ఇటిక్యాల మైరాముడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. పులికల్ ప్రభాకర్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులు సత్యాన్వేష్ (తండ్రి ప్రభాకర్), కళ్యాణ్ రాజ్ (తండ్రి రాజు), గీతిక (తండ్రి రమేష్), అలాగే హెచ్‌సీఎల్ టెక్‌బీకి ఎంపికైన విద్యార్థి వి.సువాబన్ (తండ్రి వి. రాజు)లను మరియు వారి తల్లిదండ్రులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైరాముడు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా...