హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలి
ముఖ్యమైన పాయింట్స్:సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం డిమాండ్. జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల లబ్ధిదారులకు హైకోర్టు తీర్పు మేరకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని "సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం" (జోగులాంబ గద్వాల జిల్లా) అధ్యక్షులు మరియు లబ్ధిదారుల ప్రతినిధి కె. మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన "సోమవారం ప్రజావాణిలో" ఆడిసనల్ కలెక్టర్ మదన్ మోహన్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గద్వాల పట్టణం, దౌదర్పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్లు 968, 969, 979, 980, 983,...