ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులు స్వీకరణ
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు జోగుళాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 10 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ...