పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి కసరత్తు ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ డీనోవో పద్ధతిలో ఓటర్ల జాబితా. సెప్టెంబర్‌ 28 నుండి దరఖాస్తు స్వీకరణ నమోదు గడువు నవంబర్‌ 6. డిసెంబర్‌ 30న తుది జాబితా జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మహబూబ్‌నగర్–రంగారెడ్డి –హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2027 మార్చిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సెప్టెంబర్‌ 28న ప్రజా ప్రకటన జారీ చేయడంతో...