జాతీయ లోక్అదాలత్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు నాలుగో స్థానం
ముఖ్యమైన పాయింట్స్:కోఆర్డినేషన్ సమావేశంలో అభినందించిన ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కే. కళ్యాణ్ చక్రవర్తిలోక్అదాలత్ విజయవంతానికి కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులకు ప్రశంసా పత్రాలు జోగుళాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ కే. కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. న్యాయపరమైన అంశాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు సత్వర న్యాయం అందించే విధానాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. న్యాయశాఖతో పాటు పోలీస్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు...