మొక్కజొన్న డీసీఎంలను పట్టుకుని వదిలారా?

ముఖ్యమైన పాయింట్స్:ఇందులో ఎవరి వాటా ఎంత?​అందరికీ సెటిల్‌మెంట్ చేశారని పుకార్ల బజార్లో జోరుగా చర్చ! జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-మండలం కొండపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ గిడ్డంగుల గోదాము నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు డీసీఎంల మొక్కజొన్న లోడును లారీ అసోసియేషన్ డ్రైవర్లు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ​రాత్రివేళ బ్లాక్ మార్కెట్‌కు తరలింపు? కొన్ని రోజులుగా గోదాం మేనేజర్, సిబ్బంది కుమ్మక్కై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మొక్కజొన్నను బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారని స్థానిక...