లక్ష్మీదేవికాల్వ గ్రామంలో అంగన్వాడీలో పోషణమాసం కార్యక్రమం

అడ్డగూడూరు19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో అంగన్వాడీ బడిలో శనివారం పోషణమాసం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ముఖ్య అథిదిగా సర్పంచ్ వల్లంభట్ల రమాదేవి మరియు ఐసిడిఎస్ సూపర్ వైజర్ మదురమ్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..బాలింతలు, గర్బిణిస్త్రీలు,పిల్లలు పోషకాలు ఉన్న అహారం తీసుకోవాలని, అంగన్వాడీలో ఇచ్చే పోషకాలు ఉన్న అహారము తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని చూచించారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్,కంబాల వీరయ్య, వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్ మమత,ఆయా అశ్వీని,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.