తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

కోదాడ సభలో ప్రకటనకు మార్మోగిన హర్షధ్వానాలు మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడాన్ని మించిన ఆనందం లేదు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటాం కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం: మంత్రి శ్రీధర్‌బాబు 350 కంపెనీల ద్వారా 5,725 మంది అభ్యర్థుల ఎంపిక కోదాడ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కోదాడ,...