శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా పునఃసిద్ధీకరణకు షెడ్యూల్ విడుదల

ముఖ్యమైన పాయింట్స్:అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో దరఖాస్తు చేసుకోవాలిజిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ శాసన మండలిలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితా పునఃసిద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు.ఓటరు జాబితా పునఃసిద్ధీకరణలో భాగంగా అర్హత కలిగిన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత గడువులోగా ఫారం 18లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రక్రియలో అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28నుండి నవంబర్ ఆరో...