మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

ముఖ్యమైన పాయింట్స్:త్వరలో మల్లూరు క్షేత్రంలో పర్యటించి అభివృద్ధి పనుల డిజైన్ ఖరారు చేయాలని నిర్ణయంకళ్యాణ మండపం డార్మిటరీ అన్నదాన సత్రం తదితర సౌకర్యాల అభివృద్ధికి చర్యలురాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 దేవాలయ పవిత్రతకు ప్రస్తుత నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశం ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దేవాలయ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ...