🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 6:03 pm Posted by : Telangana Vaartha

టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనం నాగేంద్ర కుమార్‌

News Image
ముఖ్యమైన పాయింట్స్:నగర అధ్యక్షుడిగా కర్లపూడి రఫీ నియామకం
ఖమ్మం:- తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) ఖమ్మం జిల్లా కమిటీలో నూతన నియామకాలు చేపట్టారు . జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనం నాగేంద్ర కుమార్‌, ఖమ్మం నగర అధ్యక్షుడిగా కర్లపూడి రఫీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వనం నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితక్కతో గత 13 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని తెలిపారు. తన సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు . ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు కర్లపూడి రఫీ మాట్లాడుతూ కవితక్క అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఖమ్మం నగరంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి సుందర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్‌, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .
🏠 Home