🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 5:47 am Posted by : జేరిపోతుల రాంకుమార్

బాణా సంచా దుకాణాలను తొలగించాలని వినతి

News Image
తిరుమలగిరి 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వలిగొండ రోడ్డు పక్కన నెలకొల్పిన బాణాసంచా ఇప్పుడే కేంద్రాలను తొలగించాలని కోరుతూ సోమవారం నాడు తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం అధికారి ఎంపీడీవోకు సీనియర్ జర్నలిస్టులు బి వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా వినతిపత్రం అందజేశారు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్నచోట బానసంచాలు విక్రయించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా జనసంచారం తో పాటు బస్సులు నిలిపే చోట విక్రయించడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు, అలాగే హోల్సేల్ విక్రయ కేంద్రాలు కూడా జన సంచారం ఉండే చోటనే నెలకొల్పారని వారన్నారు వీరీకి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తో పాటు రెవిన్యూ ,మున్సిపల్ పోలీస్ , పైర్ అధికారుల అనుమతి ఉంటేనే విక్రయించాలని అలాగే జన సంచారం లేని చోట ఈ షాపులు నెలకొల్పాలని వారుకోరారు, బాన సంచా దుకాణ యజమానులు అవన్నీ పట్టించుకోకుండా నిబంధనలకువిరుద్ధంగా జన సంచారం ఉన్న చోటనే షాపులు నెలకొల్పి విక్రయిస్తున్నారని వారు తెలిపారు వీరిపై చర్య తీసుకోవాలని కోరారు
🏠 Home