🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 12:03 am Posted by : Telangana Vaartha

కోరుట్ల నియోజకవర్గంలో ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కల్వకుంట్ల కుటుంబం

News Image
ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
కోరుట్ల:- కోరుట్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే ఆయన తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇద్దరు ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు అన్నారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఈరోజు సందర్శించి ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది రోగులతో మాట్లాడారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆసుపత్రులకు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారని కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తండ్రి ఇప్పుడు కొడుకు బాధ్యత రహితంగా వ్యవహరించి పేద ప్రజలకు సరైన వైద్యం అందకుండా సైంధవ పాత్ర పోషించారని పేదలకు అన్యాయం చేశారని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని 2023 ఎన్నికల సందర్భంగా నిర్మాణం పూర్తి చేయకుండానే హడావిడిగా ప్రారంభించారని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేదని అభివృద్ధి అనే పదం కల్వకుంట్లకుటుంబం డిక్షనరీలో లేదని కేవలం చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి ప్రచారం కోసం నాలుగు మాటలు మాట్లాడి తిరిగి హైదరాబాద్ వెళ్తాడు అని అన్నారు గతంలో బుగ్గారం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్న దివంగత మాజీ మంత్రి రత్నాకర్ రావు హయాంలో అభివృద్ధి చేశామని ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనే ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని టీఆర్ఎస్ పాలనలో కోరుట్ల నియోజకవర్గం తి రోగమన దిశగా వెనక్కి వెళ్లిందని కృష్ణారావు విమర్శించారు పట్టణంలో ఉన్న ఆసుపత్రిలో భి ఆరెస్ అధికారం లో ఉన్నప్పుడు కేవలం 7గురు డాక్టర్ లు ఉండగా కాంగ్రెస్ అధికారం లోకివచ్చాక 13ని నియమించమని అప్పుడు 5000నుండి 6000ఓపి సేవలు నెలవారీ గా ఉండగా ఇన్ పెషేంట్ లు 500ఉండగా డెలివరి లు 40మాత్రమే జరిగేవి అని 2023లో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ప్రతి నెల 100 డెలివరీ సేవలు అందుచున్నాయని అన్నారు అలాగే ఓపి సేవలు తొమ్మిది నుంచి పదివేల వరకు ఆసుపత్రిలో అందిస్తున్నారని అన్నారు 7000 ఒక 100 పేషెంట్లకు సేవలందించడం జరిగిందని అక్టోబర్ నెలలోనే 108 మంది కి ఆసుపత్రిలో డెలివరీ సేవలు అందించార ని అన్నారు ఊపి సేవలు 10189 మందికి అందించారని ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయిన 1100 మందికి సేవలందించారని గర్భవతులు బయట స్కానింగ్ లోకి వెళ్లకుండా ఆసుపత్రుడు ఉన్న 52 మందికి స్కానింగ్లు ఉచితంగా చేశానని గుర్తు చేశారు 230 మందికి తీసారని ఒక అక్టోబర్ నెలలోనే 895 మంది డయాలసిస్ సేవలు వినియోగించుకున్నట్లు తెలిపారు రక్త పరీక్షలు టీ హబ్ ద్వారా సుమారుగా 17వేల మందికి చేయడం జరిగిందని అన్నారు ఇంకా మెరుగైన సేవలు అందించాలనె సంకల్పంతో తాము ప్రభుత్వానికి విన్నవించామని అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా నియమించేలా సంబంధిత మంత్రి ఇతర ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్లపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ ఇతర కౌన్సిలర్లు రిజ్వాన్ పాషా మేడిపల్లి శేఖర్ రెడ్డి రహీం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
🏠 Home