🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 11:53 pm Posted by : Kadem Ravi

గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు.. ఎస్సై వెంకట్ రెడ్డి

News Image
అడ్డగూడూరు 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నల్గొండ నుండి వరంగల్ కు ఆటో ప్రయాణం చేస్తున్న వ్యక్తుల నుండి 90 గ్రాములు గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రైవర్ పైసా మధు వయసు 26 సంవత్సరాలు కొల్లూరి బన్నీ విశాల్ వయస్సు 26 సంవత్సరాలు ఆటోలో 90 గ్రాముల గంజాయి పట్టుబడటం జరిగింది వారి పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబర్128 దర్యాప్తు చేస్తుండగా వారికి అమ్మిన వ్యక్తి వసుకుల మణిదీప్ తండ్రి ప్రసాద్ ఎంబిబిఎస్ స్టూడెంట్ నల్గొండ ప్రభుత్వ కాలేజీ సోమవారం రామన్నపేట కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మణిదీప్ ఎంబిబిఎస్ విద్యార్థి అను నిందితున్ని కోర్టులో హాజరు పరచడం జరిగిందని అన్నారు.నిందితుల వద్ద నుండి 3 సెల్ ఫోన్లు ఆటోను సీజ్ చేయడం జరిగిందని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.
🏠 Home