🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 11:52 pm Posted by : Kadem Ravi

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

News Image
ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
రామన్నపేట 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం కక్కిరేణి గ్రామాలలో సభ్యత్వం క్యాంపెన్లో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వికలాంగులు,వృద్ధులు, వితంతువులు,ఇతర చేయూత పింఛన్‌దారులు ప్రభుత్వ ప్రకటనలపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు.కానీ ప్రభుత్వం హామీలు ప్రకటించడానికే పరిమితమైందని,వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఇంకెంతకాలం చేయూత లబ్ధిదారులను మోసం చేస్తారని వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు తక్షణమే కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రత్యేకించి వికలాంగులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,వారికి పింఛనే జీవనాధారంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసి,ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేయకపోతే, లబ్ధిదారులను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్.పిఆర్.డి జిల్లా కమిటీ సభ్యులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నాగు నరసింహ ఇంద్రపాలనగరం గ్రామ ఉపాధ్యక్షులు నూకల వెంకటేశం కోశాధికారి గోగికారి నర్సోజి పంది బాలమని పప్పు గణేష్ ఎడ్లకొండ నరసింహ జోగులా వెంకటేశం కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నబోయిన మంగమ్మ కార్యదర్శులు రమాదేవి కన్నెబోయిన సత్యనారాయణ మాన్రా చంద్రయ్య కన్నెబోయిన బిక్షం బి పద్మ కన్నబోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home