🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 11:32 pm Posted by : A.Timma Gurudu

విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

News Image
జోగులాంబ గద్వాల 2నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ ఆకాశ తారలు చిత్ర ప్రదర్శన విద్యార్థులను మేధావులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉన్నత లక్ష్యంతో తెలుగు రాష్ట్రాలలో రాజ్ కుమార్ స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంస్థ వ్యవస్థాపకురాలు రత్న కుమారి ఆధ్వర్యంలో తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని పాఠశాల పిల్లల కోసం ఆకాశ తారలు అనే స్ఫూర్తిదాయకమైన సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అయిజ లోని బ్రైట్ స్టార్ స్కూల్లో స్కూల్ కరస్పాండెంట్ ఎస్తేరమ్మ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం సైంటిస్ట్ నాసా అంటే ఏమిటి అనే ప్రత్యేక మూవీ ప్రాజెక్ట్ను ప్రదర్శించారు. ఈచిత్రం ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచడంతోపాటు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఆస్ట్రోనాట్లుగా ఎదగా లనే పట్టుదలను కలిగించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం, గణిత మేధావి శ్రీని వాస రామానుజన్ వంటి మహానుభావుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చిత్ర ప్రద ర్శన అనంతరం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్పందిస్తూ పిల్లల్లో ఎంతో ఆలోచనను, పట్టుదలను రేకెత్తించే అద్భుతమైన సినిమాను ప్రదర్శించి నందుకు అప్నా ఎన్జీవో నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
🏠 Home