శిథిలావస్థలో విద్యుత్ స్తంభం పట్టించుకోని అధికారులు
జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల మండలం కాకులారం గ్రామంలో ఎల్లాగౌడ్ ఇంటిముందు విద్యుత్ స్తంభం శిథిలావస్థలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆ వీధి ప్రజలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలం నుండి విద్యుత్ స్తంభం వల్ల కరెంటు వేర్లు చెట్టుకు తాకడం వల్ల భయంకరమైన నిప్పురవ్వలు రాలుతూ ఉన్నాయి.విద్యుత్ స్తంభం మధ్యలో రావి చెట్టుతో పాటు తీగలు తగిలి ఉండడంతో విద్యుత్తు స్తంభం నుండి వైర్లు కరెంటు సరఫరా అయ్యి భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేటి వరకు పట్టించుకోలేదని బాధితుడు వాపోయారు. గతంలో ప్రజాపాలనలో గ్రామంలో ఉన్న పాత ఇండ్లను విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఉన్నప్పటికీ అప్పట్లో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. గద్వాల విద్యుత్ ఎస్ ఈ ఫిర్యాదు చేసినప్పటికీ గద్వాల్ ఏడిఈ చెప్పిన ఆయన ఇంతవరకు పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించారు. ఇంటి ముందు ఉన్న రావిచెట్టును తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని బాధితులు ఆ వీధి ప్రజలు కోరుతున్నారు.