కలానికి దక్కిన జాతీయ గౌరవం
జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- దరూర్ జర్నలిజం అంటే కేవలం వార్తల సేకరణ మాత్రమే కాదు, సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం. ఈ దిశగా జర్నలిజం రంగంలో విశేష కృషి చేస్తూ జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ కు గద్వాలలో అభినందనలు వెల్లువెత్తాయి. నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన జాతీయ పురస్కారాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దళిత జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఫోరం సలహాదారుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలబొకే అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా దళిత జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సామాజిక అంశాలపై నిరంతరం తన గళాన్ని వినిపిస్తున్న కాశపోగు జాన్ కు లభించిన ఈ గౌరవం మరింత మందికి ప్రోత్సాహాన్నిస్తుందని అన్నారు. వృత్తిపట్ల నిబద్ధత, సామాజిక స్పృహతో సాగించే ప్రయాణానికి ఈ జాతీయ పురస్కారం గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొంటూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుమలేష్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య, ల్యాబ్ సురేష్, మన్నపురం రాముడు, జర్నలిస్ట్ కొంకల సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.