🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 November 2026, 1:45 am Posted by : Telangana Vaartha

38 ఏళ్ల నిష్కళంక వైద్య సేవలకు ఘన వీడ్కోలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:వైద్య రంగంలో సంధ్యారాణి సేవలు చిరస్మరణీయం
ఖమ్మం:- ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు అంకితభావంతో, నిష్కళంకంగా సేవలందించిన నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి పదవీ విరమణ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సాధారణ నర్సుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి నర్సింగ్ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన ఆమె సేవలు ఆదర్శనీయమని వైద్యులు, అధికారులు కొనియాడారు. విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుతో 38 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించడం అభినందనీయమన్నారు. ఆమె సేవలు నేటి నర్సింగ్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఆమెతో కలిసి పనిచేసిన సహచరులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తమ అనుబంధాన్ని, ఆమె అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. సంధ్యారాణి మాట్లాడుతూ 38 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, తన సేవలను గుర్తించి సత్కరించిన అధికారులు, సహచరులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ బి.కిరణ్, ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ ఎల్. కిరణ్, పీడియాట్రిక్ హెచ్‌ఓడీ బి. బాబురావు, ఏ.డి.సంతోష్, ఏ.ఓ. అవినాష్, నందగిరి తదితరులు పాల్గొన్నారు .
🏠 Home