16 రోజులు గడిచినా శ్రవణ్ మృతి కేసులో నివేదికలు ఎక్కడ
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు వ్యవస్థ పై మండిపడ్డ లంబాడి విద్యార్థి సేన
సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్...
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు లంబాడి విద్యార్థి సేన పోరాటం ఆగదు.
చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి 16 రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని వంకుడోతు శ్రవణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి సంబంధించిన అసలు నిజాలు ఇప్పటికీ తెలియడం లేదని, పోలీసులను అడిగినా సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోస్టుమార్టం నివేదిక అందలేదని, CDR, ఫోరెన్సిక్ నివేదికలపై కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ పురోగతి గురించి అడిగినప్పుడు అవమానకరంగా మాట్లాడారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమారుడి మృతికి సంబంధించిన నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కన్నీటితో వేడుకున్నారు.
ఈ నేపథ్యంలో లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఈరోజు ఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. భల్లా తండా నుంచి సుమారు 50 మంది కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజరై బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా లంబాడి విద్యార్థి సేన జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ మాట్లాడుతూ, 16 రోజులు గడిచినా పోస్టుమార్టం, CDR, ఫోరెన్సిక్ నివేదికలపై స్పష్టత లేకపోవడం బాధాకరమని అన్నారు. నివేదికలు సిద్ధంగా ఉంటే బాధిత కుటుంబానికి చట్టపరమైన విధానంలో అందించాలని, ఇంకా పెండింగ్లో ఉంటే ఆలస్యానికి కారణాలు, నివేదికలు ఎప్పుడు వస్తాయో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
లంబాడి విద్యార్థి సేన ప్రధాన డిమాండ్లు:
లంబాడి విద్యార్థి సేన నాయకులు మాట్లాడుతూ, పోస్టుమార్టం, CDR, ఫోరెన్సిక్ నివేదికలు తగిన సమయంలో అందుబాటులోకి రాకపోతే, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో మరింత జాప్యం జరిగితే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సూర్యాపేట ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు హరీష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రవి నాయక్ , లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరవత్ శివ నాయక్ , లంబాడివి దర్శనం సూర్యపేట జిల్లా కోఆర్డినేటర్ సుమన్ నాయక్, లంబాడి విద్యార్థి సేన సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ , లంబాడి విద్యార్థి సేన చివ్వేముల మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, లంబాడి విద్యార్థి సేన నాయకులు భూక్యా చంటి నాయక్,మోతె మండలం మాజీ సర్పంచ్ బాలాజీ, బల్లు తండాకు చెందిన వెంకన్న నాయక్, రమేష్, వంకుడోత్ గాంధీ, బల్లు తండా సర్పంచ్ భూక్య మల్సూర్, మృతుని బావ సపావత్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సుమారు 50 మంది హాజరయ్యారు. బాధిత కుటుంబం కన్నీటికి న్యాయం జరిగే వరకు లంబాడి విద్యార్థి సేన పోరాటం కొనసాగుతుంది. శ్రవణ్ మృతి వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాలి. బాధ్యులు ఎవరైనా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
లంబాడి విద్యార్థి సేన, సూర్యాపేట జిల్లా..