🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 9:03 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

ఐకెపి కేంద్ర నిర్వాహకులకు శిక్షణ

News Image
తిరుమలగిరి 01 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఖరీఫ్ సీజన్ లో మార్కెట్ నిర్వహణ కోసo అన్ని గ్రామాల్లో ఐకెపి సెంటర్ల నిర్వాహకులు సిద్ధం చేసుకొని ఉండాలని తహసిల్దార్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం మండల సమాఖ్య లో నాగారం, తిరుమలగిరి మండలాల గ్రామాలలో ఐకెపి నిర్వాహకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏలాంటి ఇబ్బంది జరగకుండా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అందుకు అనుగుణంగా కేంద్రం నిర్వాహకులు పనిచేయాలని చెప్పారు. మార్కెటింగ్ డిపిఎం అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం విక్రయించకుండా ఐకెపి కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించే విధంగా చేసి ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాల్ రూ 2461 లు,బి గ్రేడ్ రూ 2441లు కల్పించిందని అన్నారు. సన్న రకం దాన్యం ఏడు రకాల వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రైతులకు అందే విధంగా కేంద్ర నిర్వాహకులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి నాగారం ఏపిఎం లు లక్ష్మీ, వెంకట్ రెడ్డి, సీసీలు నాగయ్య, సత్యం కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home