🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 9:01 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

News Image
తిరుమలగిరి 01 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీసుల విధులు, స్టేషన్ నిర్వహణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికత వినియోగంపై తిరుమలగిరి మండలంలో 2కే రన్ నిర్వహించి పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి నాగారం ఎస్సై చిరంజీవి అర్వపల్లి ఎస్సై మధు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ మరియు పోలీసు సిబ్బంది యువత తదితరులు పాల్గొన్నారు
🏠 Home