🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 8:46 pm Posted by : Telangana Vaartha

వ్యాసరచన పోటీల్లో అనంతపురం విద్యార్థులు ప్రతిభ

News Image
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.గద్వాల.పోలీస్ ఫ్లాగ్ డే
సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు నిర్వహించిన సైబర్ నేరాల నివారణలో పోలీస్ -పౌరుల పాత్ర అనే అంశం పై నిర్వహించిన వ్యాసరచన పోటీ లో గద్వాల మండల పరిధిలోని అనంతపురం జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థి ఇర్ఫాన్ కు ప్రథమ స్ధానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారము ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతినీ అందజేశారు.అదేవిధంగా అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఐరావతి ద్వితీయ బహుమతిని ఎస్పీ చేతుల మీదుగా అందుకోవడం జరిగినది.ఈ సందర్భముగా విద్యార్థులను,గైడ్ టీచర్లు ఫ్రానిథెల్మ,జానకమ్మ లను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
🏠 Home