🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 8:45 pm Posted by : Telangana Vaartha

ఇందిరమ్మ రాజ్యంతో పేదల సొంతింటి కల సాకారం

News Image
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (రెండవ విడత) లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ 32వ వార్డు లో గల అర్హులైన పేద లబ్ధిదారులకు నిర్మాణ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం పట్టణ కేంద్రం లో గల రవి మహల్ హాల్ లో నిర్వహించారు.

AICC సభ్యులు, ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలు, మార్గదర్శకత్వంలో, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారి పర్యవేక్షణలో 32 వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ గారు మంజూరీ పట్టాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ... పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని, వార్డులోని అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా అహర్నిశలు కృషి చేస్తున్న AICC సభ్యులు శ్రీ సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో వార్డును అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
మంజూరీ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వానికి, శ్రీ సర్వోత్తమ్ రెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి, కౌన్సిలర్ శ్రీ కుంభం రాజేందర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home