🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 8:43 pm Posted by : Telangana Vaartha

బాలికల విద్యకు ప్రోత్సాహంగా సైకిళ్ల పంపిణీ

News Image
జోగులాంబ గద్వాల జిల్లా,మాన్ దొడ్డి గ్రామంలో బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డివైన్ వరల్డ్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 20 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి డివైన్ వరల్డ్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సురేష్ గారు హాజరై బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సోషల్ యాక్టివిస్ట్ N.పవన్ కుమార్ సమన్వయం చేస్తూ, సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి, బాలికలకు సైకిళ్లు అందించేందుకు చొరవ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి (MEO), MPDO, మాన్ దొడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచులు, రామచంద్ర రెడ్డి గారు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

బాలికలు విద్య కోసం పాఠశాలకు వెళ్లేందుకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.
🏠 Home