ఖమ్మం:- భారత తొలి ఉపప్రధాని, మాజీ హోంమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను బీజేపీ ఖమ్మం 1వ టౌన్ అధ్యక్షుడు గడీల నరేష్ ఆధ్వర్యంలో గుర్రాల బొమ్మ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పటేల్ సుమారు 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మందడపు సుబ్బారావు , డోకూపర్తి రవీంద్ర కుమార్, మందడపు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు రవి రాథోడ్, నకరికంటి వీరభద్రం, బోయినపల్లి సురేష్ గౌడ్, బండ్ల రిగాన్ ప్రతాప్, మేడా సంపత్ కుమార్, శ్రీలక్మి రెడ్డి, గూడా ఉపేందర్ రెడ్డి, మహీందర్ సింగ్ మరియు మండల నాయకులు పాలేపు రాము, పొట్టిముత్తి, వాణి, రుద్రగాని మాధవ్, కడుగుల ప్రభాకర్, బాలి బిందు, మరమెల్ల రామకృష్ణ, శీలం శ్రీకాంత్, బాజోజు కుమార్, లొడంగి సత్యనారాయణ, గోవిందం రామకృష్ణ, మాటేటి స్వప్న తదితరులు పాల్గొన్నారు .