🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 6:00 pm Posted by : A.Timma Gurudu

పట్టపగలే వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు

News Image
ముఖ్యమైన పాయింట్స్:- విద్యుత్ వృధా, పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని హీరో హోండా షోరూం నుండి జమ్మిచెడు వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న హై మాస్ట్ లైట్లు మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టం పగటిపూట కూడా ఆన్ లోనే ఉండటం గమనార్హం. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఇలా పగటిపూట లైట్లు వెలుగుతూ ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం పిలుపునిస్తుంటే, మరోవైపు మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేయాల్సి ఉండగా, 11 గంటలు అవుతున్న కూడా వెలుగుతూనే ఉండటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి పట్టపగలే స్ట్రీట్ లైట్లను ఆఫ్ చేయాలని పట్టణ ప్రజలు తెలిపారు.
🏠 Home