🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 5:55 pm Posted by : A.Timma Gurudu

అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహానికి ప్రహరీ గోడనుఏర్పాటు చేయండి.

News Image
ముఖ్యమైన పాయింట్స్:రాత్రి వేళలో ప్రహరీ లేనందున బాయిందోళన మధ్యన విద్యార్థులు.
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహంలో పాత డిఆర్డిఓ కార్యాలయంలో కొనసాగుతుంది. భవనానికి ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రహరీ గోడ లేనందువలన విద్యార్థులు రాత్రి వేళలో భయాందోళన మధ్యన గడిపే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేద నేతపరుస్తున్నారు. పేద వర్గాల్లోని బాలుర విద్యార్థులకు నూతన భవనం లేక భవనం లేకపోవడంతో పాత జిల్లా అభివృద్ధి కార్యాలయంలో వసతులు సౌకర్యాలు తరగతి గదులు అన్ని అధికారులు సమకూర్చారు. ఆ వసతి గృహానికి ప్రహరీ లేకపోవడంతో సమస్యగా మారిందని విద్యార్థులు బయటకి వెళ్లడం బయట జంతువులు సంచరించడం కుక్కలు పందులు తదితర వంటి రావడంతో ఈ సమస్యగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన వసతి గృహం ఇప్పటివరకు సొంత భవనం లేకపోవడంతో పాత భవనంలోనే శిఖలావస్థకు చేరిన దానిలోనే కొనసాగిస్తున్నట్లు. అవసతి గృహానికే మరుగుదొడ్లు మూత్రశాలలు స్నానపు గదులు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నది అధికారులు అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహానికి ప్రహరీ గోడకు నిధులు కేటాయించి విద్యార్థుల భద్రతకు పాటుపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ 4వ తరగతి నుంచి 8 వరకు 112 మంది విద్యార్థులు విద్యాబోధనలు చేస్తున్నట్లు రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ శేషు తెలిపారు. ప్రభుత్వం నుంచి అందించే కిట్టు ద్వారా 24 వస్తువులు సంబంధించినవి ఇవ్వడం జరుగుతుందని ఇప్పటివరకు 12 వస్తువుల రకాలు విద్యార్థులకు చేరువేసినట్లు వారు తెలిపారు. ప్రతిదీ టెండర్ ద్వారానే హాస్టళ్లకు ప్రస్తుత సామాగ్రిలు అందజేస్తున్నట్లు వాటి కావాల్సిన సరుకులు ఉదయం పూట టిఫిన్ కి మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం వేళలో కూరగాయలతో సంబంధించిన వంటలు వంటి ప్రభుత్వం ద్వారా ఉన్నతాధికారులు నేరుగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోజువారీగా మెనూ ఉంటున్నట్లు నాణ్యతమైన భోజనాలు రుచికరమైన వంటలతో విద్యార్థులకు తృప్తికరమైన భోజనాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.
అధ్యాపకులకు అందని జీతాలు :
గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ బాలురవ సతి గృహంలో పనిచేసే ఉపాధ్యాయులకు మూడు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలు గడపడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే.జీతాలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
🏠 Home