నీటిని వృధా చేయొద్దు.. కరెంటును ఆధా చేసుకుందాం
అడ్డగూడూరు 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్నినో ప్రభావంపై,కలెక్టర్ ఆదేశాల మేరకు తేదీ 22.10.26 నుండి ప్రతి గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా చివరి రోజున కంచనపల్లి గ్రామంలో సర్పంచ్ చెడే అంబేద్కర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా..ఉప సర్పంచ్ బెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం రోజు గ్రామసభ నిర్వహించారు.గ్రామసభలో ఎంపీడీవో మాట్లాడుతూ..ప్రస్తుతము కరువుకాలం సమీపించినందున ప్రజలు నీటిని కరెంటును పొదుపుగా వాడుకోవాలని,మునగ గడ్డి సాగు చేయాలనుకునే వారికి ప్రభుత్వము ఎకరానికి 14 వేలు అందిస్తుందని, అదేవిధంగా ఇండ్ల ముందు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, అందుకుగాను ప్రభుత్వము 6200 చెల్లిస్తుందని తెలిపారు. అదేవిధంగా రైతులు ముందుకు వచ్చి భూములలో ఫార్మా ఫండ్స్ నిర్మించుకోవాలని తెలిపారు.మండల పంచాయతీ అధికారి మాట్లాడుతూ.. గ్రామాలలో మహిళలు నీటి కనెక్షన్లకు విధిగా ఆన్ ఆఫ్ పెట్టుకోవాలని, కరువుతో కూడుకున్న నీటిని కార్లు,ట్రాక్టర్లు, బైకులు, బండ్లు కడగడానికి, గేదలను కడగడానికి, ఇంటి పరిసరాలు కడగడానికి నీటిని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. గ్రామంలో పగటిపూట బల్బులు వెలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి గ్రామపంచాయతీ పాలక సిబ్బందికి సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసభకి ఎంపీడీవో శంకరయ్య, తాసిల్దార్ శేషగిరిరావు, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, ఎంఏఓ, ఏఈ, టీఏ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడి టీచర్స్ ఉపసర్పంచ్ బెల్లీ శ్రీకాంత్, పాలక సభ్యులు,రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సభలో రైతులు కొంతమంది మాట్లాడుతూ.. కంచనపల్లి గ్రామంలో పశువుల డాక్టర్ గాని సిబ్బంది గానీ గ్రామంలో అందుబాటులో ఉండట్లేదని అధికారులకు రైతులు ఆవేదం వ్యక్తం చేశారు.