🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 1:51 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

పేదల ఆకలి తీర్చిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుంది ఎమ్మెల్యే మందుల సామెల్

News Image
తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిర గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ జీవన ప్రస్థానం పోరాటాలకు, నాయకత్వ పటిమకు నిలువెత్తు నిదర్శనం."పేదరిక నిర్మూలన (గరీబీ హటావో) వంటి సాహసోపేత నిర్ణయాలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేసి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు 'ఉక్కు మహిళ గా విశేష ఖ్యాతి గడించిన భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ స్రవంతి, మాజీ పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, వంగాల దానయ్య, జేరిపోతుల శోభారాణి, అబ్బాస్, కృష్ణ నాయక్, సాయి గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home