🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 10:56 am Posted by : Telangana Vaartha

డాక్టర్ రోహిణి రొండ్లకు ఏఎస్‌టీసీ జీవితకాల సభ్యత్వం

News Image
సూర్యాపేట,అక్టోబర్ 31:- విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలందించిన హైదరాబాద్‌లోని విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీజేఐటీ) కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రోహిణి రొండ్లకు అరుదైన గౌరవం లభించింది. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) జీవితకాల సభ్యత్వానికి ఆమె ఎంపికయ్యారు. 2026 అక్టోబర్ 30న హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఏఎస్‌టీసీ, సీఎస్‌ఐఆర్, ఎన్‌జీఆర్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక సదస్సు ప్రారంభ సమావేశంలో ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ చేతుల మీదుగా డాక్టర్ రోహిణి రొండ్ల జీవితకాల సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. విద్యాబోధన, పరిశోధనా రంగాల్లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ రోహిణి అంతర్జాతీయ స్థాయి పీర్‌-రివ్యూడ్ పరిశోధనా పత్రికల్లో సుమారు 50 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఆమె హెచ్‌-ఇండెక్స్ 19, ఐ10-ఇండెక్స్ 25గా ఉన్నాయి. తన పరిశోధనా ప్రతిభకు గుర్తింపుగా బెస్ట్ ఉమెన్ రీసెర్చర్ అవార్డు, బెస్ట్ ప్రెజెంటర్ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. అంతేకాకుండా, 2024లో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ ఫెలో గౌరవాన్ని పొందారు. విద్యా, శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఏఎస్‌టీసీ జీవితకాల సభ్యత్వం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవం ఆమె పరిశోధనా ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
🏠 Home