🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 October 2026, 8:22 pm Posted by : Telangana Vaartha

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ట్రైనింగ్ - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

News Image
నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన

జిల్లాలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను సర్వే ద్వారా గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కోర్సులు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఐఈఎల్ఐటి, ఆర్సెట్టి, సిఐటీడీ, టాస్క్ తదితర సంస్థల సమన్వయంతో యువతకు శిక్షణ, ధ్రువీకరణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. స్థానిక పరిశ్రమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టాస్క్ సమన్వయంతో జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అందుబాటులోకి వస్తే యువతకు విస్తృతంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
సమావేశంలో డిఆర్వో డి. ప్రేమ్ రాజు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఎం.ఎ. భారతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సత్యనారాయణ రెడ్డి, ఎన్ఐఈఎల్ ఐటి ప్రతినిధి డాక్టర్ లక్ష్మణ్, ఎన్ఎస్డీసి ప్రతినిధి ప్రతాప్ చారి, ఎస్బిఐ ప్రతినిధి వాల్యా నాయక్, సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ వజ్రయ్య, హుజూర్‌నగర్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎన్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారి చేయనైనది
🏠 Home