తిరుమలగిరి 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యేందుకు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సును తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.