🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 October 2026, 8:24 pm Posted by : Telangana Vaartha

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కేసు నమోదు చేస్తాం

News Image
ముగ్గురు యజమానులకు షోకాజ్ నోటీసులు.

అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి. వేణుగోపాల్.

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి . గద్వాల. జిల్లాలోని బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్నతాధికారాన్ని ఆదేశాల మేరకు కట్టింగ్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి వేణుగోపాల్ అన్నారు. జిల్లా పరిధిలో నీ
మల్దకల్ మండలంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్‌లో 14 మంది బాల కార్మికులను గుర్తించి రక్షించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి. వేణుగోపాల్ తెలిపారు. వీరిలో నెతోనిపల్లికి చెందిన 8 మంది, ఆలూరుకు చెందిన ముగ్గురు, పెద్దెడ్డికి చెందిన ఇద్దరు, అరగిద్దకు చెందిన ఒకరు ఉన్నారు. పత్తి విత్తనాల పొలాల్లో పనుల కోసం మూడు వాహనాల్లో బాలలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అరగిద్ద ఆంజనేయులు (రాయపురం), కురువ వీరేష్ (పెద్దెడ్డి), జమ్మన్నలపై విచారణ చేపట్టి, ముగ్గురు యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

రక్షించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (క్వచ్ ) ముందు హాజరుపరిచి, కౌన్సెలింగ్ అనంతరం చైల్డ్ హోమ్‌కు తరలించారు. బాల కార్మిక నిషేధం, నియంత్రణ చట్టం–1986 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన యజమానులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.20,000 నుంచి రూ.50,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు. విచారణ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపకుండా విద్యను అభ్యసించేలా చూడాలని, బాలల హక్కులు, భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. ఎక్కడైనా బాలలను పనుల్లో పెట్టినట్లు లేదా పనుల కోసం తరలిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కార్మిక శాఖ సీనియర్ అసిస్టెంట్ అబ్రహం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home