గొర్ల కాపరులను ఆదుకోవాలి
ప్రభుత్వం గొర్ల మేకల పెంపకం దారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు తిరుమలగిరి మండలం మాలిపురం ,గుండెపురి, వెలిశాల గ్రామంలో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస జీవన ఆధారం లేని బతుకులు గొల్ల కురుమల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అనేక గ్రామాలలో కుక్కల దాడిలో యాక్సిడెంట్లు దాడిలో వర్షాకాలం పిడుగులు పడి వేలకు వేలు గొర్లు మేకలు వాటితో పాటు వృత్తిదారులు ప్రమాదంలో చనిపోయారు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల గొర్లు మేకలు చనిపోతే గొర్ల కాపరి వృత్తినే కూలిపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం స్పందించి తక్షణమే గొర్ల మేకలకు ఇన్సూరెన్స్ చేయించాలని ఈ దేశంలో కుక్కలకు పందులకు వీటన్నిటికీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది తప్ప గొర్ల మేకలకు మాత్రం ఇన్సూరెన్స్ చేయడం లేదు తక్షణమే ప్రభుత్వం గొర్రెల మేకలకు ఇన్సూరెన్స్ చేయించాలి కోరారు యాదవుల విద్యార్థులకు ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులు ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన యాదవులకు నెలకు 5000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ భీమా పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వాన్ని కోరారుఈ కార్యక్రమంలో బండ అశోకు కడారి లింగయ్య కుమారు కొమురయ్య బొడ్డు మల్లయ్య బొడ్డు లింగయ్య తదితరులు పాల్గొన్నారు