🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 7:46 pm Posted by : Telangana Vaartha

ఏపీ ప్రభుత్వబ్రాహ్మణ ఉద్యోగి మరణమునకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

News Image
ఎ పి సీఎం చంద్రబాబు మృతి చెందిన బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ప్రకటించాలి.

గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్.

తెలంగాణ వార్త అక్టోబర్ 28 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస్ శర్మను ఎంక్వయిరీ పేరుతో తమ వద్దకు రప్పించుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రాంప్రసాద్, కార్పొరేషన్ ఎండి దేవాదాయ శాఖ అధికారి చంద్రశేఖర్ ఆజాద్, కోపరేటివ్ సొసైటీ సీఈవో నాగసాయి, త్రిపుర సుందరి లు విచారణ పేరుతో రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కార్యాలయానికి మేనేజర్ శ్రీనివాస్ శర్మనుతమ వద్దకు పిలిపించుకొని నిధుల దుర్వినియోగం విషయంలో అతనిపై బలవంతంగా తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కాగితాలపై సంతకాలు చేయించుకొని వాహనంలో తమతో పాటు శ్రీనివాస్ శర్మను తీసుకొని వెళ్లి, మార్గమధ్యంలో శ్రీనివాస్ శర్మ గోదావరి నదిలో తనంతట తానే దూకాడని ప్రచారం చేస్తున్న పైన తెలిపిన అధికారుల పై వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి శ్రీనివాస్ శర్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల.రవికుమార్ రాష్ట్ర కార్యదర్శి బుక్కపట్నం. రామాచార్యులు డిమాండ్ చేశారు.
శ్రీనివాస్ శర్మ మృతికి కారణమైన వారిపై శాఖా పరంగా అనేక కేసులు ఉన్నట్లు కూడా తెలుస్తోందని, శ్రీనివాస్ శర్మ సూసైడ్ నోట్లో ఉన్న నలుగురిపై వెంటనే కేసు నమోదు చేసి ప్రస్తుత న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించాలని దోషులపై కఠిన చర్యలు తీసుకుని బ్రాహ్మణ సమాజానికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు కు విజ్ఞప్తి చేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
అలాగే మృతి చెందిన శ్రీనివాస్ శర్మ కుటుంబానికి ఏపీబ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు. శ్రీనివాస్ శర్మ మరియు అక్కడి బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు మృతి చెందిన శ్రీనివాస్ శర్మ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి.
🏠 Home