🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 7:19 pm Posted by : Telangana Vaartha

పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం

News Image
పేద ఆర్యవైశ్యులకు బాసటగా శ్రీ వాసవి రక్షణ కవచం నిలుస్తుందని శ్రీ వాసవి రక్షణ కవచం గౌరవ సలహాదారులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, చల్లా సత్యనారాయణ లు తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయంలో సూర్యాపేటకు చెందిన పేద ఆర్య వైశ్యులు బెలిదే చంద్రశేఖర్ , పద్మ దంపతులకు పదివేల రూపాయల విలువగల సైకిల్, బీరువా, రెండు వాటర్ క్యాన్లు శ్రీ వాసవి రక్షణ కవచం వ్యవస్థాపకులు బచ్చు పురుషోత్తం తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో శ్రీ వాసవి రక్షణ కవచం స్థాపించి ఆర్యవైశ్యుల నుండి ప్రతినెలా వంద రూపాయలు సేకరించి ఒక పేద ఆర్యవైశ్యునకు పదివేల రూపాయలు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గత నెల సూర్యాపేటకు చెందిన నీళ్ల రాజ్యలక్ష్మి ఆపరేషన్ నిమిత్తం పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, రెండవ నెల గా మంచినీరు సప్లై చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చంద్రశేఖర్ కు అందజేసినట్లు తెలిపారు. పేద ఆర్యవైశ్యుల కొరకు ఏర్పాటుచేసిన శ్రీ వాసవి రక్షణ కవచం లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి రక్షణ కవచం సభ్యులు దేవరశెట్టి సత్యనారాయణ, వీరవెల్లి భాస్కర్, దేవరశెట్టి నాగరాజు, బచ్చు శ్రీనివాస్ ,సోమా ప్రవీణ్ కుమార్, ఉప్పలంచు కృష్ణ,బ్రాహ్మణపల్లి సంతోష్ కుమార్, జర్నలిస్ట్ కృష్ణ, చిత్తలూరు శ్రీధర్, సోమ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home