🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 27 October 2026, 7:29 pm Posted by : Kadem Ravi

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి..

News Image
ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ మండల నాయకుల సమావేశం
అడ్డగూడూరు 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం మంగళవారం రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి మరియు మోత్కూర్ మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ లు మాట్లాడుతూ..అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి అన్నీ వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని, విద్యార్థులకు ఫీజు రియంబెర్స్ మెంట్ ఇవ్వకుండా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా దారుణంగా మోసం చేసారని, 2027 మార్చ్ నెలలో జరుగబోయే గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు.ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఒడిసి పట్టి ఓటరు నమోదు చేయాలనీ దాని కోసం ప్రతి కార్యకర్త కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్, యూత్ మండల అధ్యక్షులు లింగాల అశోక్, మాజీ ఎంపీటీసీలు పూలపెల్లి జనార్దన్ రెడ్డి, మాదాను ఆంథోనీ, అడ్డగూడూర్ సర్పంచ్ పూజరి వనజ సైదులు, బిఆర్ఎస్ నాయకులు నాగులపెల్లి దేవగిరి,కంచర్ల చలపతి రెడ్డి,పాలాభిందెల వెంకన్న, వేంపల్ల నర్సి రెడ్డి, జక్కుల యాదగిరి గూడెపు పరమేష్, కడారి సైదులు, దాసరి బాలరాజు, కన్నేబోయిన ఎలందర్, ఎల్లంల వీర స్వామి, సూరారం రాజు, చిప్పలపల్లి నరేందర్, గొలుసుల శీను, పయ్యావుల రమేష్, చిప్పలపల్లి నర్సయ్య, పొన్నాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home