🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 9:42 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

రోడ్డుపై రైతుల ధర్నా భారీగా నిలిచిపోయిన వాహనాలు

News Image
తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రైతు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ దాదాపు 5 గంటలసేపు రైతుల నిరసన చేశారు ధర గిట్టుబాటు కాక రైతులు జనగామ సూర్యాపేట రోడ్డు పై కూర్చున్న వైనం సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారి స్థానిక తహసిల్దార్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇతర అధికారులు రైతులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వినకుండా రైతులను మోసం చేస్తున్నారు రైతు గోస పంచుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు వివరాలకు వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యము ఎక్కువ రావడం వల్ల ఇదే అదునుగా భావించిన కమిషన్ ఖరీదారులు వీరిద్దరూ కుమ్మక్కై రైతులకు సెడగోపురం పెడుతున్నారు కనీస మద్దతు ధర ఇవ్వకుండా 3000 2700 ధర తగ్గించడం సరైనది కాదని అనేకమంది రైతులు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రోడ్డుపై గంటసేపు రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ రైతు తెచ్చిన ధాన్యానికి సరైన రేటు ఇవ్వకుండా రైతులను ముంచటం కోసం మార్కెట్ యాజమాన్యం కుమ్మక్క అయిందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రైతు పండించిన వరి ధాన్యానికి 3800 ₹3900 ఇవ్వాలని రైతు సంఘం నాయకులు తెలిపారు వరి సీజన్ ప్రారంభం నుండి నేటికి నెలరోజులు కావస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం బాధాకరమైన విషయం ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకెపి సెంటర్లో రైతులకు 4000 కింట చొప్పున ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రైతుల తదితరులు పాల్గొన్నారు
🏠 Home