🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 8:18 pm Posted by : Telangana Vaartha

పల్లె ప్రకృతి వనాన్ని ఆక్రమించి, సెల్ టవర్ దందా నడిపిస్తున్న అవినీతి అధికారులపై

News Image
చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో పెద్దదిన్నె గ్రామస్తుల ఫిర్యాదు.
జోగులాంబ గద్వాల 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
, ఇటిక్యాల.*మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలో ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలపై పెద్దదిన్నె గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లెల్లో హరితహారాన్ని పెంచాలని, పచ్చదనాన్ని కాపాడాలని కోట్లాది రూపాయలు వెచ్చించి పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేసింది.
కానీ, పెద్దదిన్నె గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఉన్న పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికేసి, ఆ స్థానంలో ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు.

ఈ అక్రమ నిర్మాణంపై గ్రామస్తులు ప్రశ్నిస్తే.. సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి మాత్రం ఇది గ్రామ అభివృద్ధి కోసం అంటూ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారు.
ప్రకృతిని కాపాడాల్సిన చేతులే, కమీషన్లకు కక్కుర్తి పడి ప్రకృతి వనాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ అక్రమ తంతుపై మా ప్రధాన ఆరోపణలు
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.
ప్రభుత్వ నిధులతో, ప్రజల కోసం పెంచిన పచ్చని చెట్లను అక్రమంగా నరికివేసి పర్యావరణ చట్టాలను ఉల్లంఘించారు.
అధికార దుర్వినియోగం
ప్రకృతి వనం స్థలాన్ని సెల్ టవర్ నిర్మాణానికి కేటాయించే అధికారం సర్పంచ్‌కు గానీ, పంచాయతీ కార్యదర్శికి గానీ నిబంధనల ప్రకారం లేదు.
ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీగా ముడుపులు తీసుకునే ఈ అక్రమానికి పాల్పడ్డారు.
కాబట్టి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పెద్దదిన్నె గ్రామ పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి. విధి నిర్వహణలో పూర్తిగా విఫలమై, అక్రమాలకు కొమ్ముకాస్తున్న గ్రామ కార్యదర్శి, సర్పంచ్
అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పై విషయం పై పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ని సూర్య న్యూస్ నుంచి చరవాణి ద్వారా వివరణ కోరగా ఆయన గ్రామసభ నిర్వహించి గ్రామ అభివృద్ధి మేరకు తీర్మానం చేసి తీర్మానం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
🏠 Home