🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 8:10 pm Posted by : Telangana Vaartha

పోలీసు అమరవీరుల స్మారకార్థం మంగళవారం సూర్యాపేటలో భారీ బైక్ ర్యాలీ: ఎస్పీ నరసింహ ఐపీఎస్

News Image
​సూర్యాపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల స్మారక బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ​ఈ బైక్ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) వద్ద ప్రారంభమై కోర్టు చౌరస్తా, పి.ఎస్.ఆర్. సెంటర్, రాఘవ ప్లాజా, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు కొనసాగుతుందని వివరించారు. ​సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
🏠 Home