రవి అనే రైతును రక్తం వచ్చేలా కొట్టిన గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డి.
యువ రైతుపై దారుణంగా దాడి చేసిన ఎస్ఐ.
తన సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భీమరి రవి అనే రైతును రక్తం వచ్చేలా కొట్టిన గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డి.
కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడిగితే, తనకు తెలియదని సమాధానం ఇచ్చిన రవి.
మరి పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా అంటూ రవిని కొట్టిన ఎస్ఐ మల్లారెడ్డి.
ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టాడని రైతు ఆవేదన.
నిజానికి ఇలాంటి అధికారాలు మనకి అనేక ప్రదేశాల్లో కనబడుతూ అంటారు . అవసరమే లేని పనుల్లో వేలు పెట్టి అమాయకుల మీద దాడులు చేస్తారు .
పాత సినిమాల్లో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఉండేవారో కొంత మంది ఖాకీ నీడన అలా అగుపిస్తారు .
"రాజకీయం - పోలీస్ యంత్రాంగం" ఒకరికొకరం అన్నట్టుగా మారి దారి తప్పుతున్నాయి .