🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 1:51 am Posted by : Telangana Vaartha

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

News Image
36ఏళ్ల తర్వాత కలుసుకున్న గుంపుల తిరుమలగిరి జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
సూర్యాపేట: చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989- 90 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాటి విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలోని తమ యొక్క నాటి స్మృతులు మరిచిపోలేని మధురానుభూతులని అన్నారు.36 ఏళ్ల తర్వాత నాటి విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.తాము చదువుకున్న రోజులను, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పి నేడు ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.అంతకు ముందు తమ నుండి దూరమైన ఉపాధ్యాయులకు,తోటి విద్యార్థులకు ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరూ వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నారాయణ, వెంకటేశ్వర రావు, సావిత్రి, విద్యార్థులు బి.వెంకటేశ్వర్లు, ఎం.వెంకన్న, డి.నాగేష్, ఎం.రాము, వై.వెంకటరెడ్డి, కోటేశ్వరరావు, లింగయ్య, శ్రీనివాస్, బాలాజీ, పిచ్చయ్య, శేఖర్, కవిత, పిచ్చమ్మ, రాజకుమారి, సత్యవతి, లక్ష్మీ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home