ఆత్మకూరు మైనర్ బాలిక మృతి కేసులో 24 గంటల్లో నిందితుడి అరెస్ట్
సూర్యాపేట జిల్లా, 26 అక్టోబర్, 2026:- ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక మృతికి సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన ఘటనలో వేధింపులు భరించలేక బాలిక ఈ నెల 22వ తేదీ రాత్రి మృతిచెందినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వాంకుడోతు నరేశ్, మాన్య తండా, ఏపూర్ తండా నివాసిని అక్టోబర్ 24వ తేదీన అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా రిమాండ్కు పంపించినట్లు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్ వెల్లడించారు. సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు, నిందితుడి అరెస్ట్ ప్రక్రియలో ఆత్మకూరు (ఎస్) ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడటం తీవ్రమైన నేరమని, మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పోలీసులు తెలిపారు.