🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 October 2026, 9:20 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన

News Image
తిరుమలగిరి 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులకు పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, నేర పరిశోధన, నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసు విధివిధానాలు, నేరాల పరిశోధన, నేరస్థులను గుర్తించే పద్ధతులు, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు, విద్యార్థులు, బాలల రక్షణలో పోలీసు శాఖ పాత్ర గురించి వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను త్వరితగతిన ఛేదించడంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలను విద్యార్థులకు తెలియజేశారు.అదేవిధంగా పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫింగర్‌ప్రింట్ పరికరాల పనితీరు, నేరస్థుల డేటాబేస్ నిర్వహణ, నేర పరిశోధనలో వాటి ఉపయోగాల గురించి వివరించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించాలి

ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాల్లో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎస్‌ఐ సూచించారు. దేశం, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలని, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోలీసుల విధులు, త్యాగాలు, ప్రజల భద్రత కోసం వారు చేస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home