రైతులుప్రకృతివ్యవసాయం పద్ధతులను అమర్చుకోవాలని
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ఎర్రవల్లి.మండలం రిధిలోనిపుటాన్ దొడ్డి గ్రామరైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేతీ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ మండల ఎంపీడీఓ మహేష్ పుటాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఏఈఓలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా నేల సారవంతం పెరిగి పంటల దిగుబడి మెరుగుపడుతుందని తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరిగనేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.
రైతులు నేల సారాన్ని కాపాడుకుంటూ పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు సాధ్యమవుతాయ పంటలు బాగుంటేనే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు.
కావున ప్రతి రైతు నేల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించేలా బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా వ్యవసాయ అధికారి పిలుపునిచ్చారు.
అలాగే మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ఎట్టి పరిస్థితుల్లో వరి వేయకూడదని రైతులకు తెలియజేశారు.