🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 October 2026, 8:50 pm Posted by : A.Timma Gurudu

రోడ్డుపై మురుగునీరు ప్రయాణికులకు అవస్థలు

News Image
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రం నుంచి అలంపూర్ వెళ్లే రహదారి గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎర్రవల్లిలో గుంతల్లో మురుగునీరు చేరడంతో వాహనాలు వెళ్ళేటప్పుడు పాదాచారులపై మురుగునీరు చిమ్ముతుంది. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home