జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.* ఇటిక్యాల. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్ సునంద (డిబ్ల్యు ఓ.) అధ్యక్షతన మండల స్థాయి సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు సర్పంచుల ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశంనిర్వహించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు గత 45 రోజుల క్రితం అభివృద్ధి పనులపై మండల స్థాయి సమావేశం నందు సర్పంచులకు వారి వారి శాఖల వారు చదివి వినిపించడం జరిగింది. ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ కూలీలకు ఉపాధి కల్పించాలి. గ్రామాలలో కూలీలకు బి బి జి రామ్ పథకం కింద ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. ఏలినో ప్రభావంతో ప్రజలకు తాగునీటి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించి 40 మంది కూలీలకు ఒక మేటితో పనులు చేయించాలని పంచాయతీ కార్యదర్శిలకు సర్పంచులకు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఆఫీసర్ సునంద( డి డబ్ల్యు ఓ ) మాట్లాడుతూ చైల్డ్ మ్యారేజ్ లు అవ్వకుండా వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సర్పంచులను పంచాయతీ కార్యదర్శులను వారు కోరారు.
వివిధ గ్రామాల సర్పంచులు విద్యుత్ తమ తమ గ్రామాలలో విద్యుత్ సమస్యలు చాలా ఉన్నాయని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యుత్ ఏఈ శేఖర్ మళ్లీ వచ్చే మండల స్థాయి సమావేశానికి పూర్తిగా గ్రామాల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని వారు సభకు తెలియజేయడం జరిగింది. మునగాల సర్పంచ్ ఇటిక్యాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మహిళా సంఘాల సిబ్బంది వారు మా గ్రామంలో అవకతవకలు చేయడం జరిగిందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై స్పెషల్ ఆఫీసర్ స్పందిస్తూ అవకతవకలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళ సమైక్య ఏపీఎం పద్మకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి. ఎంపీడీవో రమాదేవి. వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు. ఎపిఓ అశోక్. ఏవో రవికుమార్. ఇటిక్యాల ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాధిక. ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలమ్మ. ఆర్టికల్చర్ అరుణ. ఏపీఎం పద్మ. తదితరులు పాల్గొన్నారు.