అద్దె భవనంలో ఐసిడిఎస్ కార్యాలయం
జోగులాంబ గద్వాల 24 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. పట్టణ కేంద్రంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కార్యాలయం అద్దె భవనంలో ఇరుకుల ఇబ్బందులతో కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయము సొంత భవనానికి నోచుకోకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. ఇక్కడ రెగ్యులర్గా చైల్డ్ డెవలప్మెంట్ అధికారి సిడిపిఓ విధుల నిర్వహణలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని సెంటర్లను పరిశీల నిమిత్తం పనిచేస్తున్న సూపర్వైజర్ల పర్యవేక్షణ తదితర వంటి విషయాలను పూర్తిస్థాయిలో సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపాల్సి ఉన్నది. జిల్లా కేంద్రంలోని 262 సెంటర్లు పనిచేస్తున్నట్లు అందులో 230 అంగన్వాడీ టీచర్స్. 33 అంగన్వాడి వర్కర్స్ అవసరం ఉన్నద ని అధికారుల ద్వారా వెల్లడించారు. గద్వాల పట్టణ పరిధిలోని 14,282 మంది పిల్లలు. గర్భవతులు 14 80. బాలింతలు 1069 ఆయాలు 139 మంది విధులు నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. ప్రతినెల అంగన్వాడి సెంటర్ లేక అభివృద్ధి సమీక్ష సమావేశాలు ప్రాజెక్టు సెక్టార్ మీటింగులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్న అద్దె భవనం వలన సరిపోకపోవడంతో సమీపంలో ఉన్న రైతు వేదికలు వంటి వాటిలోనూ ప్రాజెక్టు సెక్టార్ మీటింగులు నిర్వహించుకునే పరిస్థితి ఐసిడిఎస్ అధికారులకు ఏర్పడిందని చెప్పవచ్చు. స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్య నిర్వహణ బాధ్యతలు చేపట్టి కూడా గద్వాల్ పట్టణంలో సుమారు 20 సంవత్సరాలు కాలం గడుస్తున్న భవనం లేకపోవడం వలన అనేక సమస్యల గూండా ప్రయాణిస్తూ అధికారులు సెంటర్ లేక అభివృద్ధి. పిల్లల పౌష్టికాహారం పంపిణీ దుస్తులు తదితర మెటీరియల్ వచ్చినప్పుడు సమస్యగా ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. అంగన్వాడి సెంటర్ల నిర్వహణ పూర్తిస్థాయిలో సొంత భవనం లేకపోవడం అద్దె భవనాల్లో పాఠశాలలో తదితర రకాలలో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ కొనసాగుతున్నాయి. గద్వాల పట్టణ కేంద్రంలోని సూపర్వైజర్లు 8 మంది పనిచేస్తున్న సెక్టార్ పరిధిలోని అంగన్వాడి సెంటర్లో పరిశీలనలో సూపర్వైజర్ పాత్ర కీలకంగా ఉంటుంది. సిడిపిఓ ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వాన్ని నిబంధనల మేరకు. పంపిణీ రుచికరమైన భోజనాలు. పిల్లలకు ఆటలు పాటలతో విద్యాబోధనలు. బొమ్మల ద్వారా గ్రహింపడం. తూకములు కొలతలు షీట్ ద్వారా ప్రతి పిల్లవాడిని ప్రోగ్రెస్ పూర్తిస్థాయిలో సమాచారంతో చేయాల్సిన బాధ్యత సిడిపిఓ అధికారుల పైన ఉన్నది. కీలక బాధ్యతతో పరిరక్షణ చేయాల్సిన అధికారికి అద్దె భవనంలో కొనసాగడం వలన ఇబ్బందులతో కాలం చెల్లిస్తూ విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదనపరిచారు.
అద్దె భవనాల్లో వసతులు లేక అసౌకర్యాలే... అంగన్వాడి సెంటర్ల నిర్వహణ బాధ్యతలు చైల్డ్ డెవలప్మెంట్ అధికారి. సిడిపిఓ సూపర్వైజర్లు సిబ్బంది చూడాల్సిన అవసరం ఉన్నది. నిత్యం కార్యాలయానికి వచ్చి విధుల నిర్వహణలో అద్దె భవనంలో వచ్చి సౌకర్యాలు లేని దుస్థితిలో ఉన్న కార్యాలయంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారితోపాటు సూపర్వైజర్లు వివిధ కార్యక్రమాలపై పట్టణ ప్రజలు వచ్చినప్పుడు వాళ్లు కూర్చోవడానికి కూడా స్థలం లేని పరిస్థితులు. త్రాగునీటి సౌకర్యాలు లేక మరుగుదొడ్లు మూత్రశాలలు తగినన్ని గదులు లేక అంగన్వాడి సెంటర్ లోకి వచ్చే దుస్తులు భద్రపరచలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే మెటీరియల్ను కాపాడేందుకు కూడా గదులేని పరిస్థితి ఏర్పడడంతో సెంటర్లకు పంపించడం అక్కడ అంగన్వాడీ టీచర్లతో బాధ్యతలు అప్పగించి ఉండడమే జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఐసిడిఎస్ భవన నిర్మాణానికి విధులు మంజూరు చేసి భావన నిర్మాణాన్ని చేపట్టి అధికారులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైన ఉన్నది.