రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి
- భూ సర్వే వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి
- పొగిళ్ల గ్రామంలో 1,066 ఎకరాల భూమి సర్వే పూర్తి
- భూ సర్వేకు సంబంధించి ఇప్పటివరకు 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారుల వెల్లడి
- భూముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
- అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా కొనడం, అమ్మడం చేయకూడదు
- భూముల విస్తీర్ణంలో తేడాలుంటే రైతులు, అధికారులు చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలి
- అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలి
- ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
- తక్కువ నీటితో సాగు చేసే పంటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలి
- బంజరు భూముల్లో మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి
- సోలార్ విద్యుత్ విక్రయంతో మహిళా సంఘాలకు ఆదాయం పెరిగే అవకాశం
- పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారీని ప్రోత్సహించాలి
- చందంపేట మండలం పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో భూ సర్వే వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్👆